KMM: బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ హామీ నెరవేర్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఖమ్మం దానవాయిగూడెంలో KCR ప్రభుత్వ హయాంలో నాటిన తాటి, ఈత వనాన్ని అయన పరిశీలించారు. గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఒరిగిందేమీ లేదన్నారు.