రాజమౌళి దేవుడిపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో జక్కన్న పాత ట్వీట్ తాజాగా వైరలవుతోంది. 2011లో రామనవమి విషెస్ చెప్పిన అభిమానికి ఆయన స్పందిస్తూ.. ‘థాంక్యూ కానీ నాకు రాముడు అంటే ఇష్టం లేదు. దశావతారాల్లో కృష్ణుడే నా ఫేవరెట్’ అని బదులిచ్చాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘రాముడి పేరుతో మూవీలు తీసి ఎందుకు సంపాదిస్తున్నారు’ అంటూ మండిపడుతున్నారు.