MNCL: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. MNCL జిల్లా వేమనపల్లికి చెందిన లత(35) తమ్ముడు అరుణ్ బైక్పై GDK నుంచి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో తన చీర కొంగు వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో కింద పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా లత అక్కడికక్కడే మృతిచెందింది.