ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటి నగర్ గ్రామంలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదించగా ఏ ఒక్క అధికారి స్పందించడం లేదంటూ వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.