VZM: APని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు CM చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంత శ్రమిస్తున్నారో ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు నిదర్శనం అని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఉద్ఘాటించారు. సోమవారం ఎల్. కోట TDP కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వచ్చేలా లోకేష్ తీవ్ర కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.