SKLM: కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా టెక్కలి మండలంలోని రావివలస గ్రామంలో ఉన్న ఎండల మల్లికార్జున స్వామిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ముందుగా ఆలయ ఈవో గురునాధరావు ఆలయ సంప్రదాయంతో మంత్రిని సాదర స్వాగతం పలికారు. ఆలయ పురోహితులు వేదమంత్రాల తో తీర్థ ప్రసాదాలు అందించారు.