కోనసీమ: ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరించొద్దని కోటి సంతకాల కార్యక్రమం మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కాలేజీ ప్రైవేటీకరించడం వల్ల పేదలకు వైద్యం అందని పరిస్థితి వస్తుందని మండపేట వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అందువల్ల మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకూడదని పేర్కొన్నారు.