ATP: ఇటీవల రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన పామిడికి చెందిన విద్యార్థులను ఆదివారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, పామిడి మండల ఇన్ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో రాణించాలని కుస్తీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.