BPT: అద్దంకి పట్టణంలో సోమవారం సాయంత్రం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించనున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.