GDWL: పవిత్ర కార్తీక మాసంలో హరిహరాదుల పుణ్యక్షేత్రమైన జిల్లా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో చివరి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ తిమ్మప్ప స్వామి ఈశ్వర ఆలయాలలో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.