KDP: కలసపాడు ST కాలనీకి చెందిన దొమ్మర శ్రీనివాసులు (17) ఇంటి సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మద్యానికి బానిసై నిత్యం కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడు. ఈ మేరకు నిన్న నొప్పి తాళలేక ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI తిమోతి తెలిపారు.