ATP: చెర్లోపల్లి పంచాయతీ కార్యాలయంలో 2011లో విదేశీయుల సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 20 లీటర్ల వాటర్ క్యాన్ కేవలం రూపాయికే లభిస్తోంది. అయితే నిర్వహణ ఖర్చు పెరగడంతో ప్రస్తుతం నెలకు ఒక్కో కుటుంబం రూ.90 చెల్లిస్తోంది. గ్రామంలో తాగునీరు నిర్వరామంగా అందుతోందని ప్రజలు తెలిపారు.