MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ఇవాళ ఉదయం తాలూకా పరిధిలోని దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం మండలాల్లో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి, తదితర మండలాల్లో 14 డిగ్రీకు పడిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.