ఏలూరు నగరంలో 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన పడమర వీధి గంగానమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించార. కాగా ఈ జాతరలో సినీ హీరోయిన్ చాందిని చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చాందిని చౌదరి బోనాలు నెత్తి పెట్టుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.