NRML: పెంబి మండలంలోని వేణునగర్లో అంగన్వాడీ కేంద్రం వద్ద గుంతలో పడి మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ కోరారు. ఇవాళ వేణునగర్లో చిన్నారి కుటుంబాన్ని ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంతలో పడి చిన్నారి మృతి చెందడం బాధను కలిగించిందని భావోద్వేగానికి గురయ్యారు.