దక్షిణాది అగ్రనటి త్రిష తన పెళ్లి అంశంపై SMలో వస్తున్న తప్పుడు వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్నేహితులతో దిగిన ఫొటోలను వక్రీకరించి అసంబద్ధమైన కథనాలు రాయడంపై ఆమె మండిపడింది. ‘నేను ఎవరితో ఫోటో దిగితే వారినే పెళ్లి చేసుకున్నట్టా? ఇంక ఎంతమందితో నా పెళ్లి చేస్తారు? అలాంటి రూమర్లు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇకనైనా ఫేక్ న్యూస్ ప్రచారం ఆపండి’ అని పేర్కొంది.