చలికాలంలో ఎక్కువగా జలుబు, ఫ్లూ వస్తుంటాయి. కొన్ని టిప్స్ వాడడంతో వాటిని దూరం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. జలుబు, గొంతు నొప్పి వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి రిలాక్స్ అవ్వాలంటే.. గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి రోజుకు మూడు సార్లు గార్గిలింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు తగ్గడంతో పాటు వైరస్లు చనిపోయే అవకాశాలు ఉన్నాయి.