VSP: మానవ తప్పిదం వల్లనే 85% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు అన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన వరల్డ్ రీమెంబర్స్ డే ఫర్ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదాలు నివారించేందుకు ప్రతి డ్రైవర్ ఏకాగ్రత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ వైద్యాధికారి కిషోర్ పాల్గొన్నారు.