ప్రకాశం: బైకులకు కంపెనీ సైలెన్సర్ తప్ప వేరే సైలెన్సర్లు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని కనిగిరి సీఐ ఖజావలి వాహనదారులను హెచ్చరించారు. ఇతర సైలెన్సర్లు బిగించడం వల్ల వచ్చే శబ్ద కాలుష్యం, వాహన కాలుష్యం ప్రజలకు అనారోగ్యం అని అన్నారు. అలా అమర్చిన వారు తిరిగి కంపెనీ సైలెన్సర్ అమర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.