కోనసీమ: రౌడీ షీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. జిల్లాలోని అయినవిల్లి, అంబాజీపేట, అల్లవరం మండలాలలోని రౌడీ షీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లాలో అసాంఘిక శక్తులు, రౌడీయిజం, గుండయిజంకి తావు లేదన్నారు. పాత నేరాలను పునరావృతం చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.