బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులకు సంబంధించి ఇవాళ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-బంగ్లాదేశ్(ICT) తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్.. ‘తీర్పు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అమ్మను దోషిగా నిలుపుతారు. బహుశా మరణశిక్ష విధిస్తారేమో’ అని పేర్కొన్నాడు. తీర్పు నేపథ్యంలో బంగ్లా రాజధాని ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు.