NRML: ధాన్యాన్ని అకాల వర్షం, తేమ నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్ కవర్లను అందజేయాలని జన్నారం (మం) పలు గ్రామాల రైతులు కోరారు. వ్యవసాయ రికార్డుల ప్రకారం.. మండలంలో మొత్తం 11 వేల మంది రైతులు ఉన్నారు. వానకాలం సీజన్లో వేసిన వరి కోతలు ప్రారంభం కాగా కొన్ని గ్రామాలలో రైతులు ధాన్యాన్ని ఎండకు ఆరబోస్తున్నారు. మార్కెట్ కమిటీ ద్వారా సరిపడా టార్ఫాలిన్ కవర్లు అందించాలని రైతులు కోరుతున్నారు.