శబరిమల అయ్యప్ప ఆలయం నిన్న సాయంత్రం తెరుచుకున్న నేపథ్యంలో భక్తులకు స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులను ఇవాళ తెల్లవారుజాము నుంచే దర్శనాలకు అనుమతిస్తున్నారు. డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచే ఉంటుందని.. ఆ తర్వాత డిసెంబర్ 30- జనవరి 20 తేదీల్లోనూ దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.