E.G: పెరవలి మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల కుమార్తెపై కన్న తండ్రే మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో తల్లికి ఈ విషయం తెలిసింది. ఆమె భర్తను నిలదీయగా వివాదం జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పెరవలి పోలీస్ స్టేషన్ ఎఫ్ఎఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.