మఖానా ఉదయాన్నే తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తక్షణ శక్తిని అందిస్తాయి. కొవ్వు తక్కువగా, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండటంతో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.