కాకినాడ కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి రాలేనివారు ఆన్లైన్లో కూడా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.