TG: సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఇవాళ్టి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. L1, L2 నుంచి L12 వరకు మిల్లుల విభజనను వ్యతిరేకిస్తూ మిల్లర్లు ఈనెల 6న బంద్కు పిలుపునిచ్చారు. అయితే, మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు బంద్ ఆలోచనను వాయిదా వేశారు. 10 రోజులైనా నిబంధనల్లో సడలింపులు లేకపోవడంతో ఇవాళ్టి నుంచి బంద్ చేశారు.