VSP: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, భూమిని భవిష్యత్త్ తరాల కోసం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీశాఖ విశ్రాంత ప్రిన్సిపల్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి అన్నారు. సింహాచలం దేవస్థానం గోశాలలో ఆదివారం సాయంత్రం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం నిర్వహించిన ప్రకృతి పంటల మేళాలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు.