AP: రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల BSC నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయవాడలోని NTR హెల్త్ వర్సిటీ తెలిపింది. APNCET-2025లో 20 పర్సంటైల్ కంటే ఎక్కువ, 85-17 కటాఫ్ స్కోర్ మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ నవంబర్ 18. వివరాలకు అధికారిక వైబ్‌సైట్‌ను సంప్రదించాలి.