ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పంచారామాలతో పాటు శ్రీశైలం, యాగంటి, వేములవాడ, కీసర, కాళేశ్వరం తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.