AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5-15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.