కృష్ణా: అవురుపూడి గ్రామంలో విశ్వ మానవ సంక్షేమ సంఘం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమంలో మస్తాన్ రావు మాట్లాడుతూ. మన దేశంలోని ప్రజలు ఎక్కడబడితే అక్కడ మలవిసర్జన చేస్తున్నారని, దీనివల్ల దోమలు, ఈగలు వ్యాపించి, జ్వరాలు, అంటూ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిపారు.