NZB: మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీల (వీడీసీ) పెత్తనం రోజురోజుకూ పెరిగిపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కల్లుగీత కార్మికులు వద్ద ఎవరైనా కల్లు తాగితే రూ.5 వేల జరిమానా విధిస్తామని వీడీసీ హెచ్చరికలు జారీ చేసిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.