GNTR: తెనాలి బీసీ కాలనీలోని ఖాళీ స్థలాల్లో మురుగు నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. కాలనీలోకి వెళ్లే మార్గంలో పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలం నిర్వహణ లేక మురుగు నీటితో నిండిపోయింది. భరించలేని దుర్గంధం వెదజల్లటంతో పాటు దోమలు, వరాహాలకు ఆవాసంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.