SKLM: పోలాకి మండల పరిధిలో ఉన్న పలు గ్రామాలలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఎంపీడీవో రవికుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సేవలో ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, వగైరా పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మండల పరిధిలో ఉన్న ప్రజల గమనించి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.