సత్యసాయి: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 19న పుట్టపర్తికి వస్తున్నారని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 18న పుట్టపర్తికి వచ్చి సత్యసాయి బాబా సమాధిని దర్శించుకుంటారని చెప్పారు.