ఐబొమ్మ బ్లాక్ అయినా.. క్రేజ్ తగ్గడం లేదు. ఐబొమ్మలో ఇతర సైట్ల మాదిరిగా యాడ్స్ ఉండవు. సినిమా చూసేందుకు క్లిక్ చేసినప్పుడు ఒకసారి యాడ్ వచ్చినా, దాన్ని క్లోజ్ చేస్తే మళ్లీ కనిపించదు. ముఖ్యంగా HD ప్రింట్ వల్ల లక్షల మంది వీక్షకులు ఈ సైట్ల సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. iBomma, బప్పం వెబ్సైట్లను ప్రతి నెలా 30 లక్షల మంది వీక్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.