ఆగ్రాకు చెందిన అన్నదమ్ములు ఆయుష్, రిషబ్ గుప్తా కూరగాయలు, ఆర్గానిక్ విధానంలో పుట్టగొడుగుల పెంపకంతో నెలకు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఆగ్రాలో 2021లో కూరగాయల సాగు, 2022లో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. నెలకు 40 టన్నుల పుట్టగొడుగులు, 45 టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. వీరి వార్షిక టర్నోవర్ రూ.7.5 కోట్లు. యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలి.