NZB: జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆదివారం జిల్లాలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాలూరలో 9.9, చిన్నమావందిలో 10.2, మాక్లూర్ మండలం మదన్పల్లిలో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల తర్వాత బయటకు వెళ్లే పరిస్థితి లేదని, ఉదయం 8 గంటల తర్వాతే ప్రజలు బయటకు వస్తున్నారన్నారు.