మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పేదల తిరుపతి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామిని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.