MBNR: పానగల్ మండలంలో ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఐకేపీ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన మాధవరావుపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి, మాధవరావుపల్లి – శాఖపూర్- కదిరపాడు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.