ATP: రాయదుర్గం పట్టణంలో మంగళవారం అరుదైన బ్రహ్మ కమలాలు వికసించాయి. టీచర్స్ కాలనీ రెండవ క్రాస్‌లో ఉపాధ్యాయుడు నాగేంద్ర నివాసంలో బ్రహ్మ కమలాలు వికసించడంతో వాటికి పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. ఏడాదికోసారి మాత్రమే అరుదుగా ఈ బ్రహ్మ కమలాలు వికసించనున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు బ్రహ్మ కమలాలను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు.