WGL: నర్సంపేట (M)లోని రాజుపేటపల్లె గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభం కోసం స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భవనం నిర్మాణ పనులు పూర్తయ్యి నెలలు గడిచినా, దవాఖానను సేవలోకి తీసుకురావడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య అధికారులు స్పందించి దవాఖాన ప్రారంభించాలని ప్రజలు కోరారు.