MHBD: తొర్రూరు పట్టణ శివారులో సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక లోడుతో వెళుతున్న లారీలు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ధ్రువ పత్రాలను పరిశీలించారు. అధిక వేగంతో, ఓవర్ లోడుతో వెళ్లే వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.