MHBD: తొర్రూరు నుంచి కంటాయపాలెం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్నా మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. పగలు, రాత్రి వేళలో ప్రయాణించే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు మాత్రం ఈ మూలమలుపు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.