కోనసీమ: సఖినేటిపల్లి అంతర్వేది తీరంలో మత్స్యకారుల వలలకు అరుదైన చేపలు చిక్కాయి. ఆదివారం వాటిని వేలం వెయ్యగా.. ప్రధానంగా 13 గోల్డ్ ఫిష్ (కచ్చిడి) చేపలు ఏకంగా రూ. 52 వేలు పలకడం విశేషం. ఇక మార్కెట్లో కోనాం కిలో రూ.600, కవర్లు రూ.70, బోంబేడెక్ రూ.65 చొప్పున ధర పలికాయి. మంచి ధర దక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.