KRNL: జిల్లా ఉపాధికల్పన కార్యాలయం ఆధ్వర్యంలో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి పి. దీప్తి సోమవారం తెలిపారు. ఈ నెల 20వ తేదీన నగరంలోని సి. క్యాంపులో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభం అవుతుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.