SS: సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. 340 సీసీ కెమెరాల నిఘా, మూడు కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీఐజీ షిమోషితో కలిసి ఆదివారం 17 జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు భద్రతపై కీలక సూచనలు చేశారు.