నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాల బాలికలకు నగరంలోని డీఎస్ఏ మైదానంలో నేడు ఖోఖో వన్డే టోర్నీని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నాగేశ్వ ర్రావు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో 18 ఏళ్లలోపు క్రీడాకారులు అర్హులని చెప్పారు. మ్యాచ్లు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఆసక్తి గల వారు పాల్లొన్ని తమ ప్రతిభను చాటాలన్నారు.