WNP: కాంగ్రెస్ ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు శాలువాతో సన్మానం చేసి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు గడ్డం వినోద్ యాదవ్, దేవన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.